ఓడి పోయాను…నా డబ్బు వాపసు చేయండి..తెలంగాణా ఎన్నికలలో ఓ అభ్యర్థి రుబాబు

0
227
advertisment

మనఛానల్ న్యూస్ – తెలంగాణా న్యూస్ డెస్క్
ఇటివల తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఓట్లకోసం విచ్చల విడిగా డబ్బు,మద్యం ఏరులై పారించారు.లక్షలాది రూపాయిలు వ్యయం చేసి ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థులు కొందరు ఓటర్ల వద్దకు వెళ్లి తాము ఇచ్చిన సొమ్ము వాపసు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తన డబ్బు తీసుకొని తనను ఓడించినందున తాను ఇచ్చిన నగదు వాపసు చేయాలని చాలా చోట్ల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొన్నిచోట్ల ఓటర్లు తిరగబడుతుండడగా, మరికొన్ని చోట్ల గొడవలు పడుతూ పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లతున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణలో ఓ గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటి చేసిన ఓ వ్యక్తి ఎన్నికలలో ఓడిపోవడంతో గ్రామం అంతా తిరుగుతూ తన వద్ద ఓటు వేస్తామని తీసుకొన్న డబ్బును వాపసు చేయాలని కోరుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

దీనిపై స్పందించిన కొందరు నెట్ జన్లు ఓటుకు డబ్బు తీసుకొన్న వారికి ఈ విధంగా జరగాల్సిందేనని ఎత్తి పొడుస్తున్నారు.తస్మాన్ జాగ్రత్త భవిష్యత్ లో ఓటుకు డబ్బు తీసుకొని మీకు డబ్బు ఇచ్చిన వ్యక్తి ఓడిపోతే తన డబ్బు వాపస్ ఇవ్వమని మెడపై కత్తి పెట్టవచ్చు…జాగ్రత్త…!!

ఈ వీడియో లింక్ క్లిక్ చేయండి…

https://www.facebook.com/voiceoftelangana202/videos/2078099835813589/?t=31

advertisment

https://www.facebook.com/voiceoftelangana202/videos/2078099835813589/?t=97