ఉన్నత చదువులతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు – మిట్స్‌ ప్రిన్సిపాల్‌ డా.సి.యువరాజ్‌

0
28
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
చిత్తూరుజిల్లా అంగళ్లు సమీపంలోని మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల) నందు శుక్రవారం రాయలసీమలోని డిగ్రీ కళాశాలల విద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలలోని ఎం.సి.ఏ మరియు ఎం.బి.ఏ విభాగము వారు విద్యార్థులకు వివిధ కార్యక్రమాలను కళాశాలల్లో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతోనే నిలిపివేయకుండా ఉన్నత స్థాయి చదువులకి ప్రాధాన్య తను ఇవ్వాలన్నారు. చాలా మంది విద్యార్థులకు డిగ్రీలోనే ఉద్యోగాలు లభించాయని, ఇక చదువు చాలనుకుంటుంటారని, కానీ ఎంత చదివితే అంత భవిష్యత్తు మనకు ఉంటుందనే విషయాన్ని గ్రహించాలన్నారు.

ప్రస్తుతం తమ కళాశాలలో ఎం.సి.ఏ మరియు ఎం.బి.ఏ కోర్సులు ఉన్నాయని, తమ కళాశాలలో చదివే 60% మంది విద్యార్థులకి ఉద్యోగాలు లభించాయని ఆయన అన్నారు. ఆర్ధిక స్థోమత అనేది అడ్డంకి కాదని, చదవాలనే మనసులో ఉంటే ఉన్నత స్థాయి చదువులకు అడ్డంకే లేదన్నారు. విద్యార్థులు వారు చదివే సమయములోనే ఉన్నత చదువులను పూర్తి చేయాలన్నారు.

తమ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఎన్నో కంపెనీ లలో ఉన్నత స్థానాలలో ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమలో విద్యార్థులకు నిర్వహించిన చాలా కార్యక్రమాలలో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను అందజేశారు.