మదనపల్లిలో నాలుగో రోజుకు చేరుకున్న రహదారి భద్రతా వారోత్సవాలు

0
32
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు మదనపల్లి రవాణాశాఖ కార్యాల యంలో నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 10 వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి విదితమే. నాలుగవ రోజైన గురువారం రవాణాశాఖ కార్యాలయం నందు పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెంది న వాహన చోదకులకు మరియు ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ వాహన చోదకులకు రహదారి భద్రతాపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. అవగాహన లోపంతోపాటు, మైనర్లు వాహనాలను నడపడం, మద్యం మత్తులో వాహనాల నడపడం ద్వారా అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు.

ఇప్పటికే ద్విచక్రవాహన దారులు హెల్మెట్లు ధరించడం, నాలుగు చక్ర వాహనదారులు సీటుబెల్టు పెట్టుకోవడంపై ప్రజలకు వివి ధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు.అయినప్పటికీ ఈ నిబంధనలను కొందరు పాటించకపోవడం బాధాకరమన్నారు.

అందరూ కనీస జాగ్రత్తలు పాటిస్తే రోడ్డుప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చునన్నారు. అనంతరం సుమారు 100 మంది పాఠశాల వాహనచోదకులు, ఆటోడ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారిణిలు సునీత, సుప్రియ మరియు రవాణాశాఖ కార్యాలయపు సిబ్బంది పాల్గొన్నారు.