బ్రహ్మానందానికి హీరో అల్లు అర్జున్‌ పరామర్శ

0
136
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
తెలుగులో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకొన్న సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమమైన ఆసుపత్రి అయిన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో గత నెల 14న ఆయనకు గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది.

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందాన్ని స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. ఆయన మునుపటిలా చురు క్కా సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని ఆయన ఆకాంక్షించారు.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.