కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

0
16
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
ఆరో ద్వైమాసిక సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కీలకవడ్డీ రేట్లను తగ్గించింది.ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లలో పావుశాతం కోత విధించింది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మూడు రోజుల పాటు జరిగిన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ నేడు ప్రకటించింది.మానిటరీ పాలసీ కమిటీలో వడ్డీరేట్ల తగ్గింపుపై నలుగురు సభ్యులు సానుకూలంగా స్పందించగా ఇద్దరు వ్యతిరేకించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వ్యవస్థలోకి నగదు ప్రవా హాన్ని పెంచి వృద్ధిరేటును మెరుగుపరచాలన్న ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయం ఉంది.

ద్వైమాసికక సమీక్షలో ఆర్‌బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలివే..

– రెపో రేటును 6.5శాతం నుంచి 6.25శాతానికి తగ్గింపు
– రివర్స్‌ రెపో రేటును 6శాతానికి, బ్యాంకు రేటును 6.5శాతానికి తగ్గింపు
– మార్చి త్రైమాసికంలో ద్రవ్యల్బోణం 2.8శాతంగా ఉండొచ్చని అంచనా
– 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 3.2-3.4శాతంగా, ఆ తర్వాత మూడు నెలలు 3.9శాతంగా ఉంటుందని అంచనా
– 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4శాతంగా అంచనా