ఏపి,తెలంగాణా రాష్ట్రాలలో లోకసభ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో రాహుల్ కసరత్తు

0
37
advertisment

బి.ఎం.రెడ్డి,  బ్యూరో ఛీఫ్  – మనఛానల్ న్యూస్, న్యూఢిల్లీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొలుకోలేని దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీని 2019 లోకసభ ఎన్నికలలో ఏపి, తెలంగాణా పుంజుకొనేలా చేయడానికి ఏమి చేయాలనే దానిపై రాహుల్ గాంధి దృష్టి సారించారు.

ఈ మేరకు ఆయన గతవారం చివరిలో రెండు రాష్టాల సీనియర్ నేతలతో విస్రృతంగా మంతనాలు జరిపారు. ఎపి నుంచి మాజీ సి.ఎం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత కె.వి.పి రామచంద్రరావులు,ఎపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జీ ఉమెన్ చాంది  తెలంగాణ నుంచి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ వర్కంగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పి.సుధాకర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ పి.సుధీర్ కుమార్ తదితర నేతలతో ఆయన సుధీర్ఘంగా చర్చించారు. రెండు రాష్ట్రాలలో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి రాహుల్ గాంధి రెండు రాష్ట్రాల నేతల నుంచి సమాచారం సేకరించారు.

2019 లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో అధిక స్థానాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఏపిలో కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సి చర్యలను మాజీ సి.ఎం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకొన్నారు. లోకసభ ఎన్నికలలో ఏపిలో ఏమేమి చేయాలో చర్చించారు. పార్టీలో సీనియర్లు పార్టీ మార్పుపై ఆరా తీశారు.

ఏపిలో పార్టీని బలోపేతం చేయడానికి చొరవ తీసుకోవాలని రాహుల్ మాజీ సి.ఎం.కిరణ్ కుమార్ రెడ్డిని సూచించారు. తెలుగు రాష్ట్రాలలో మెుత్తం 42 స్థానాలలో అధిక స్థానాలలో కాంగ్రెస్ గెలవడానికి కేడర్ లో ఉత్తేజం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ త్వరలో కార్యక్రమాలు రూపొందించడానికి ప్రయత్నిస్తోంది.