ఆకట్టుకుంటున్న విశాల్‌ ‘‘ఆయోగ్య’’ మూవీ టీజర్‌

0
27
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
తెలుగులో ఎన్టీఆర్‌ నటించి సూపర్‌హిట్‌ సాధించిన సినిమా ‘టెంపర్‌’. దీనికి రీమేక్‌గా తమిళంలో ‘ఆయోగ్య’గా వస్తున్నది. ఈ సినిమాలో విశాల్‌ హీరోగా నటిస్తున్న విషయం విదితమే.ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పోలీసు అధికారిగా విశాల్‌ మాస్‌ నటన, ఫైటింగ్‌ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో విశాల్‌కు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. వెంకట్‌ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్‌ హౌస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు.‘టెంపర్‌’ చిత్రాన్ని హిందీ లోనూ రీమేక్‌ చేశారు.

రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటించారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం హిందీలోనూ మంచి విజయం అందుకుంది. మరి తమిళంలో ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.