వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభంజనం ఖాయం – నాయకులు డా.మైఫోర్స్‌ మహేష్‌

0
42
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏపిలో జనసేన ప్రభంజనం ఖాయమని జనసేన నాయకులు డాక్టర్‌ మైఫోర్స్‌ మహేష తెలిపారు. బుధవారం మైపోర్స్‌ మహేష్‌ సమక్షంలో మహిళా నాయకురాలు చామంతుల మల్లిక ఆధ్వర్యంలో రామారావు కాలనీ వడ్డిపల్లెకు చెందిన పెద్దలు,యువత మరియు విద్యార్థులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ డా.మైఫోర్స్ మహేష్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం ప్రతి ఒక్కరు కుల మతాలతో సంబంధం లేకుండా జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకి ఓట్లు వేయించి జనసేన పార్టీని గెలిపించాలన్నారు. అలాగే జనసేన పార్టీలో మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిం చారు.

ఈ సందర్భంగా మల్లిక గారు మాట్లాడుతూ మదనపల్లిలో డా.మైఫోర్స్ మహేష్ నాయకత్వంలో అన్ని వార్డుల్లోను జనసేన పార్టీని బలోపేతం చేసి ప్రత్యేకంగా మహిళలకు పార్టీ సిద్ధాంతాలను విశదీకరించి వారిని జనసేన పార్టీలో స్వచ్చందంగా చేరేటట్లు చేసి అన్నీ వార్డుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసి విజయం సాధించి మదనపల్లి అసెంబ్లీ నియోజక వర్గాన్ని బహుమతిగా ఇస్తామని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఈ సందర్బంగా ఆమె తెలియజేశారు.

అనంతరం డాక్టర్ మై ఫోర్స్ మహేష్ మాట్లాడుతూ జనసేన పార్టీకి పెరుగుతున్న ప్రతిష్టకు జనసేనలో రోజురోజుకు పెరుగు తున్న సభ్యత్వాలే ఇందుకు నిదర్శనమన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జనసేన అధినేత చేపడుతున్న యాత్రలపై స్పందన చుస్తే రానున్నది జనసేనాని పవన్ కళ్యాణ్ రాజ్యమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దయ్య, వెంకటప్ప,మధు ,కార్తీక్ రెడ్డి, జుబేర్ భాష,మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.