భారత్‌కు త్వరలో విజయ్‌ మాల్యా – బ్రిటన్‌ హోంమంత్రి సాజిద్‌

0
27
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ బ్రిటన్‌ హోంమంత్రి సాజిద్‌ జావీద్‌ సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు.దీంతో భారతీయ బ్యాంకుల వద్ద వేల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా త్వరలోనే భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు ఫిబ్రవరి 4 నుంచి 14 రోజులపాటు మాల్యాకు టైముంది. హైకోర్టు మాల్యా అప్పీల్‌ను తిరస్కరిస్తే ఆయన వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది.విచారణకు స్వీకరిస్తే హైకోర్టు తీర్పును బట్టి తదు పరి పరిస్థితులుంటాయి. మాల్యా భారత్‌లో ఓ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి ఉందనీ, ఆయనను భారత్‌కు తిరిగి పంపించాలని తీర్పునిస్తూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు గతేడాది డిసెంబర్‌ 10న తీర్పు చెప్పింది.

ఆ తీర్పు హోం శాఖకు చేరింది. కాగా, పాక్‌ సంతతికి చెందిన మంత్రుల్లో అత్యంత సీనియర్‌ అయిన జావీద్‌ మాల్యాను భారత్‌ కు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఆదివారం సంతకం చేశారు.కేసులోని అంశాలు, పరిస్థితులను బట్టి చూస్తే హై కోర్టు తీర్పు సైతం మాల్యాకు వ్యతిరేకంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు నష్టాలు రావడం వల్లే తాను అప్పులు తీర్చలేక పోయానని మాల్యా గతంలో లండన్‌ కోర్టులో వాదించగా, అప్పు రూపంలో లభించిన డబ్బును మాల్యా అసలైన అవసరానికి వాడకుండా, పక్కదారి పట్టించాడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు గతంలో గుర్తించింది.