అమెరికాలో 30 మంది తెలుగు విద్యార్థులకు ఊరట

0
85
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
ఫర్మింగ్‌టన్‌ ఫేక్‌ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వ్యవహారంలో అరెస్టయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది విద్యా ర్థులతో ఊరట లభించింది. ఆ విద్యార్ధులు అమెరికానుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా తెలుగు సంఘాల నాయకుడు నవీన్‌ జలగం మీడియాకు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ నకిలీ వీసాల కేసులో అమాయక విద్యార్ధులు ఇరుక్కుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా జైళ్లనుంచి విద్యార్ధులను విడుదల చేయించేందుకు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు న్యాయ సహాయం చేస్తున్నాయని తెలిపారు.తన ఫేస్‌ బుక్‌ ఐడీకి స్టూడెంట్స్‌ వివరాలు పంపమని సాక్షితో ఆయన కోరారు.

విద్యార్ధుల తల్లిదండ్రులు కంగారుపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మిగిలిన విద్యార్ధులు ఇండియాకు చేరకుంటారని చెప్పారు. ఇమిగ్రేషన్‌ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. కాగా ఈ కేసులో మొత్తం 130మంది విద్యార్ధులు అరెస్టవ్వగా వారిలో అధికులు భారతీయులు కావటం గమనార్హం.