కువైట్ లో ముస్లీం హక్కుల పోరాట నేత ఎపి అసెంబ్లీ ఎన్నికలలో పీలేరు నుంచి పోటికి పయనం

0
275
advertisment

– ఘనంగా వీడ్కోలు పలికి పంపిన సహచరులు
– చిత్తూరు జిల్లా కలికరి మండంల మహల్ కి చెందిన అన్వర్ హుస్సేన్

మనఛానల్ న్యూస్ – గల్ఫ్ ప్రతినిధి
కువైట్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేసుకొంటున్న ఎన్.ఆర్.ఐ త్వరలో జరిగే ఎపి అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేయడానికి కువైట్ నుంచి భయలు దేరారు.

చిత్తూరు జిల్లా కలికిరి మండలం మహల్ గ్రామానికి చెందిన అన్వర్ హుస్సెన్ ఉపాధి కోసం కువైట్ వచ్చారు. స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే కువైట్ లోని ముస్లీం సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ముస్లీం హక్కుల పోరాట సమితిలో ఈయన చిత్తూరు జిల్లా విభాగానికి అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు.

త్వరలో ఎపిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగాలని నిర్ణయించారు. దీంతో కువైట్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికలలో పోటి చేయడానికి ఇండియాకు తిరుగు పయనం అయ్యారు. ఈనేపథ్యంలో అన్వర్ హుస్సేన్ కు సహచరులు, ముస్లీం సంక్షేమ పోరాట సమితి సభ్యులు ఘనంగా సన్మానించి ఆయనకు వీడ్కోలు పలికారు.