చంద్రబాబు నిరసనకు సంఫీుభావం తెలిపిన ఎన్‌ఆర్‌ఐ టిడిపి కువైట్‌ విభాగం

0
52
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
ప్రధాన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌పై చూపుతున్న నిర్లక్ష్యం, నిరంకుశ, నియంతృత్వ ధోరణులకు మరియు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను చట్టబద్ధతను విస్మరించడానికి నిరసనగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లచొక్కా ధరించి శాసనసభకు వచ్చి నిరసన తెలిపిన సంగతి విదితమే. ఇందుకు సంఫీుభావంగా ఎన్‌ఆర్‌ఐ టిడపి కువైట్‌ విభాగం ఆధ్వర్యంలో కువైట్‌ సిటీలోని ఒమేరియా పార్క్‌లో నిరసన చేపట్టారు.

ఈ కార్యక్రమంలో apnrt co ordinators, nri tdp commanders, excutive council members పాల్గొ న్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికి మోడీ తీరని ద్రోహం చేస్తున్నాడని,తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని కూడా విస్మరించడం అన్యాయం అని,కనీసం ఈ రోజు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేకపోవడం ఆశ్చర్యం వేస్తుందని,మనం పన్నులు కడుతున్నామన్నారు.

మన హక్కులను మనం అడుగుతున్నాము అయిన వారు చిన్న చూపు చూడడం బాధ వేస్తుందని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని,సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్నా రని,కాపులకు 5%రిజర్వేషన్ చట్టబద్దత కల్పిస్తున్నారని ,ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.మళ్ళీ చంద్ర బాబును ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.