రాష్ట్ర బంద్‌ విజయవంతానికై మదనపల్లిలో అఖిలపక్ష భేటీ

0
54

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హమీల అమలు కోరుతూ ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వ ర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ, సీపీఎం, జనసేన, వీసీకే, కాంగ్రెస్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. బంద్ జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ కార్యాలయంలో వారు అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంధర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణప్ప, మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ, సీపీఎం మద నపల్లి డివిజన్ కార్యదర్శి శ్రీనివాసులు, జనసేన నాయకులు మైపోర్స్ మహేష్, కాంగ్రెస్ నాయకులు వేమయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శివారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర విభజన రాజ్యాంగబద్దంగా జరగలేదన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీలు నెరవేర్చలేదని,వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధికి నిధులివ్వలేదని విమర్శించారు.

నాలుగున్నర సంవత్సరాలుగా ఇదే అన్యాయాన్ని కొనసాగిస్తూ వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ చట్ట ప్రకారం చేయవలసిన పనులను సత్వరం చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు.

తెలుగు ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీ చులకన భావనని ప్రదర్శస్తున్నదని ఆరోసిస్తూ, ఫిబ్రవరి 1న జరగే రాష్ట్ర బంద్ లో మదనపల్లి నియోజకవర్గ ప్రజలు, వ్యాపారస్తులు విద్యాసంస్థలు, విద్యార్థి, యవజన సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బంద్ ను జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మురళి, చంద్ర శేఖర్, వెంకటరమణ, జనసేన నాయకులు రాయల్ గణి, ఏఐఎస్ఎఫ్ నాయకులు నల్లజోడు పవన్, కాంగ్రెస్ నాయకులు వేమయ్య, తదితరులు పాల్గొన్నారు.