చెర్లోపల్లి (తిరుపతి)జెడ్.పి.హైస్కూల్ లో విద్యార్థులపై పడ్డ యాసిడ్ బాటిళ్లు – పలువురికి గాయాలు

0
445

మనఛానల్ న్యూస్ – తిరుపతి
తిరుపతికి సమీపంలోని చెర్లోపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ప్రమాదవశాత్తు యాసిడ్ బాటిళ్లు విద్యార్థులపై పడి పలువురికి గాయాలు అయిన సంఘటన సోమవారం సాయంకాలం జరిగింది. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘోరానికి కారణం సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పెషల్ క్లాస్ ఉందంటూ పిల్లలందరినీ డిజిటల్ క్లాస్ రూమ్ కి పంపారు.

పిల్లలు డిజిటిల్ క్లాస్ చూస్తుంటరనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు భయటకు వెళ్లారు.ఉపాధ్యాయులు లేని సమయంలో క్లాస్ రూమ్ లో విద్యార్థులు ఒకరిపై ఒకరు తోపు లాటలు చేసుకున్నారు. ఇదే క్రమంలో అక్కడి పై బాగంలో భద్రపర్చిన యాసిడ్ బాటిల్లు హఠత్తుగా పిల్లలు మీద పడడంతో వారి శరీరం కాలడంతో..తీవ్ర గాయాలతో కేకలు పెట్టారు.

సమాచారం తెలుసుకొన్న వెంటనే పిల్లల తల్లిదండ్రులతో పాటు పుదిపట్ల ఎంపీటీసీ బడి సుధాయాదవ్ తన కారులో హుటా హుటిన తిరుపతి రుయాకు తరలించి వైద్యం సేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఉపాధ్యాయల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.