తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ కొనసాగిన టీఆర్‌ఎస్‌ జోరు

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలి తాల్లోనూ అదే హవా కొనసాగించింది. ఆ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయ ఢంకా మోగించారు. సగానికి పైగా సీట్లలో గులాబీ జెండా రెపరెపలాడగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మినహా మిగతా పార్టీలేవీ పెద్దగా ప్రభావం చూపలేక పోయా యి.

స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల తమ బలం నిరూపించుకున్నారు. తొలిదశలో 3701 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ జరిగింది. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా తెరాస 2629, కాంగ్రెస్‌ 920, తెదేపా 31, భాజపా 67, సీపీఐ 19, సీపీఎం 32, ఇతరులు 758 చోట్ల విజయం సాధించారు. పలు కారణాల వల్ల 14 పంచాయతీల్లో ఫలితాలు ఇంకా వెలువడలేదు.

తొలి దశలో 4479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నోటీసు ఇవ్వగా తొమ్మిది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 769 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3701 పంచాయతీ సర్పంచి పదవులకు పోలింగ్‌ జరిగింది. మరోవైపు పల్లెల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికల్లో 85.76 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా 41,56,414 ఓట్లు పోలయ్యాయి.