
మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఈనెల 25 వరకు పెంచుతున్నట్లు ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడిం చారు.గత అనుభవాలను అనుసరించి పంచాయతీ కార్యదర్శుల(గ్రూపు-3) ఉద్యోగాలకు 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తా యని ఏపీపీఎస్సీ అంచనా వేసింది.
శనివారంతో గడువు ముగియనుండగా శుక్రవారం నాటికి 3,16,525 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువును ఈ నెల 25వ తేదీ వరకు పెంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మధ్యలో డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తాయని కమిషన్ అంచనా వేసింది.
అయినప్పటికీ కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తుల రాక తగ్గింది. దీనిపై ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ 2016 నుంచి పరీక్షలు రాసిన ప్రతి అభ్యర్థి మార్కులు వెల్లడించాం. దీంతో వారి శక్తిసామర్థ్యాలు తెలుసుకునేందుకు వీలు ఏర్పడింది. వీటిని పరిశీలించుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆలోచించి ఉంటారని భావిస్తున్నాం.
గ్రూపు-3 ఉద్యోగాలకు 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా శుక్రవారం సాయంత్రానికి 3,16,525 మాత్రమే రావడం ఆలోచింపజేస్తోంది. అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో గడువును వారం వరకు పొడిగించామని వివరించారు.