పొరగడుపున మంచినీరు త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు అనేకం…

0
47
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
ప్రస్తుత నిత్యజీవితంలో మానవులు అనేక జబ్బుల బారిన పడుతున్నారు. దీనికి కారణాలు అనేకం. ఆహారపు అవాట్లు, ఇతర అవాట్లే ప్రధాన కారణాలు. ప్రస్తుత పరిస్థితుల్లో పొరగడుపునే నీరు త్రాగడం ఎంతో ముఖ్యం.ఆరోగ్యం విషయంలో తాగు నీరు పాత్ర చాలా ముఖ్యమైంది. వాహనం నడువాలంటే ఇంధనం ఎంత అవసరమో మనిషి శరీరం పనిచేయాలంటే నీరూ అంతే అవసరం. అందునా పరిగడుపున నీళ్లు తాగటం మరింత మేలు చేస్తుంది.

ఉదయాన్నే నీరు త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు…:

– ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగితే మల విసర్జన సులభంగా జరుగుతుంది.
– పరిగడుపున నీళ్లు తాగటం వల్ల ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలు ఏ రోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి.
– పెద్ద పేగు శుభ్ర పడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది.
– రక్త వృద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఉపయోగపడుతుంది.
– కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం.
– జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేర పెరుగుతుంది.
– బరువు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
– చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది.
– మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్ల ముప్పు తక్కువ. వచ్చినా వెంటనే తగ్గుతాయి.
– ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.