వై.ఎస్‌.జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడికి ఈనెల 25 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ

0
8
advertisment

మమనఛానల్‌ న్యూస్‌ – విజయవాడ
వైఎస్సార్‌సీపీ అధినతే, ఏపి ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ అధికారు నిందితుడైన జనుపల్లి శ్రీనివాసరావుని విజయవాడ ఎంఎస్‌జే కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు.

ఈ నెల 25 వరకు నిందితుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్ఐఏ పిటిషన్‌ దాఖలు చేసింది.నిందితుడి తరుపు న్యాయవాదులు ఎవరూ కస్టడీ పిటిషన్‌పై

కౌంటర్ దాఖలు చేయక పోవడంతో పిటిషన్‌ని న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. వాచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్ కాపీని నిందితుడికి కోర్టు అందజేసింది.