వెనుజులా అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన నికోలస్‌ మాద్యురో

0
13
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
రెండోసారి వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్‌ మదురో పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు.

రాజధాని కారకస్‌లో జరిగిన మదురో ప్రమాణస్వీకార కార్యక్రమానికి 94 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మదురో బాధ్యతలు చేపట్టడాన్ని అమెరికా, కెనడా సహా డజను లాటిన్‌ అమెరికా దేశాలు వ్యతిరేకించాయి.

ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు.