వి.ఎం.వేర్‌ ఐటీ అకాడమీ ఆధ్వర్యంలో మిట్స్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ మైక్రోకోర్స్‌ నిర్వహణ

0
27
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
అంగళ్లు సమీపంలోని మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల) నందు బీ.టెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ మైక్రో కోర్సును నిర్వహించినారు. వి.ఏం వేర్ ఐటీ అకాడమీ (VMware) వారు నిర్వహిస్తున్న ఈ కోర్స్ నందు మొత్తం ఐదు మాడ్యూల్స్ ఉంటాయి.

అందులో వర్చ్యులైజేషన్, హైపర్విజర్, డేటా సెంటర్, వర్చువల్ డేటా సెంటర్, మరియు వి.ఏం వేర్ వర్చ్యులైజేషన్ సొల్యూ షన్స్ లు ఉంటాయని ఏ. రమేష్ బాబు, జిల్లా డెవలప్మెంట్ మేనేజర్, అపిటా (APITA) అన్నారు. ఈ కోర్స్ ద్వారా విద్యార్థు లకు వర్చువల్ మెషిన్ పై అవగహన పెంచడానికి ఒక మంచి అవకాశం అన్నారు. ఈ కోర్స్ ను విద్యార్థులు 8 గంటల పాటు ఆన్లైన్ లో అభ్యసిస్తారని అన్నారు.

విద్యార్థుల కు ఈ కోర్స్ ఉచితంగా నిర్వహిస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు అపిటా వారు సంయుక్తముగా ఈ కోర్సును విద్యార్థుల కొరకు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కోర్స్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మరియు ఎలక్ట్రికల్ విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ ట్రైనింగ్ ను మూడు దశలలో జరుగితుందని, మొదటి దశలో విద్యార్థులు 8 గంటలపాటు శిక్షణను అందుకుంటారు.

రెండవ దశలో 60 గంటలు మరియు మూడవదశలో 40 గంటలు శిక్షణను అందజేస్తారని, మొదటి దశలో శిక్షణ అందు కున్న విద్యార్థులు మాత్రమే మిగిలిన రెండు దశలు పూర్తి చేయుటకు అర్హులన్నారు. విద్యార్థులకు ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, డీన్ ఐఐఐసీ డాక్టర్ రామప్రసాద్ రావు, తదితరులు పాల్గొన్నారు.