విశ్వం విద్యాసంస్థల ఆధ్వర్యంలో 13న (ఆదివారం) సంక్రాంతి సంబరాలు

0
107

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
అంగళ్లు సమీపంలో ఉన్న విశ్వం విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈనెల 13న (ఆదివారం) తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న 79 పంచాయతీల్లో సుమారు 100 గ్రామల్లో ఉదయం 9 గంటల నుండి సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయని విశ్వం విద్యాసంస్థల అధినేత మలిపెద్ది ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

మన సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించుకోవడానికి తంబళ్లపల్లి నియోజకవర్గం అంతటా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశా మన్నారు. ఈ సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, కోలాటం, పాటల పోటీలు (జానపద గేయాలు), ఖో-ఖో పోటీలు మరియు పురుషులకు పరుగుపందెం, కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా ఈ పోటీల్లో రెండు పోటీలను ఎంపిక చేసుకోవచ్చునన్నారు.

తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న గ్రామపంచాయతీ, ప్రభుత్వ పాఠశాల మరియు మండల కేంద్రాలో ఎంపికలు నిర్వహి స్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గలవారు వారి పేర్లను పైన సూచించబడిన కేంద్రాలలో నమోదు చేసుకోవా లన్నారు. కావున తంబళ్లపల్లి నియోజకవర్గంలో జరుగు ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా పోటీలలో గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సం క్రాంతి పండుగ ప్రతి కుటుంబంలో సంతోషాలను నింపాలలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ మా సంస్థ ఆధ్వ ర్యంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో మీ కుటుంబ సభ్యులతో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.