వివేకానంద పురపాలక పాఠశాలలో మిన్నంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు

0
132
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లి మాయాబజార్‌లో ఉన్న వివేకానంద పురపాలక ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం  ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశంలో పర్వదినాలను ఎంతో భక్తిశ్రద్ధతో నిర్వహిస్తారన్నారు.భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క బలమన్నారు. మన సం స్కృతి, సంప్రదాయాలకు పండుగలే నిదర్శనమన్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారన్నారు. కోడిపందేలు, గొబ్బెమ్మలు, మహి ళలు వేసే వివిధ రకాల ముగ్గులు ఎంతో అలరిస్తాయన్నారు.ముఖ్యంగా రబీ సీజన్‌ పంటలను ఒడుపుకొని ఇళ్ల తీసుకొనే శుభసందర్భంగా రైతులు ఈ పర్వదినాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం మన సాంప్రదాయాులు కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైనా ఉన్నదన్నారు.

అదేవిధంగా భోగి నుంచి ముక్కనుమ వరకు వాడవాడలా ఆనందోత్సాహంతో నిర్వహించుకునే ఈ వేడుక మన  సంప్రదాయా లకు నిలువుటద్దం ఈ సంక్రాంతి పర్వదినమన్నారు. భూమిని కన్నతల్లిగా ఆరాధించే తత్త్వం భారతీయులది. దీన్ని అనాధిగా పాటిస్తున్నామని, ఈ భావన సదా ఉన్నప్పుడు జాతి జాతిగా నిలుస్తుందన్నారు. ఈ భావ జాగృతికి ప్రతీకలు పండుగలు. వీటిలో అతి ముఖ్యమైనది మకర సంక్రాంతి.

అనంతరం విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, ముగ్గులు, గాలి పటాలు ఎగురవేయడం తదితర కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.బాలకృష్ణన్‌, ఉపాధ్యాయులు కె.జ్యోతి, బి.జ్యోతి, ఎన్‌. బయ్యారెడ్డి, ఎం.శోభారాణి, ఎస్‌.మధురాణి, టి.హసీనా, ఎస్‌.షాహీన్‌ తాజ్‌, వై.ఇష్రత్‌ ఫాతిమా, ఎ.నందిని, వి.ఉమాదేవి, బి.విజయ్‌కుమార్‌ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.