మదనపల్లి జెడ్.పి.హైస్కూలులో ఓటర్ల నమోదుపై విద్యార్థులకు పోటీలు

0
68
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఓటరు నమోదు కార్యక్రమం పై  మదనపల్లి మండల రెవెన్యూ విభాగం వారు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. 9వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని మండల స్థాయిలో 9వ తరగతి విద్యార్థుల నుండి డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల విబాగం డిప్యూటి తాహిశీల్దారు ఎ.ఫణికుమార్ తెలిపారు.

మండల స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, క్వీజ్ పోటీలు నిర్వహించి ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని , జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం మదనపల్లి జెడ్.పి.హైస్కూల్ లో  నిర్వహించిన ఈ కార్యక్రమాలను హెడ్ మాస్టర్ ఎస్.రెడ్డన్న శెట్టి పర్యవేక్షించారు. 100 మంది విద్యార్థులు పాల్గోన్న ఈ పోటీలకు మదనపల్లి బి.టి కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మునిరత్నం సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సోషియల్ ఉపాధ్యాయులు యుగందర్, తెలుగు పండింట్ బాబు నాయక్, మదనపల్లి రెవెన్యూ విభాగం సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ అహ్మాద్, వి.ఆర్.ఓ కె.సి.గిరిధర్, జూనియర్ అసిస్టెంట్ జి.అస్లాంబాష, వి.ఆర్.ఎ శ్రీనివాసులు పాల్గోన్నారు.