పుంగనూరు రాయసీలమ చిల్డ్రన్స్ అకాడమీలో అలరించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు

0
57
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – పుంగనూరు
పుంగనూరు రాయసీలమ చిల్డ్రన్స్ అకాడమీలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా మునిసిపల్‌ కమిషనర్‌ కె.ఎల్‌.వర్మ,లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ ఎన్‌.రెడ్డెప్పలు హాజరయ్యారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి తెలుగువారికి పెద్దపండుగ…పుడమికి, ప్రకృతికి, గోసంతతికి, సమాజంలో మనకు చేదోడుగా ఉన్నవారికీ కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశాన్ని కలిగించే పర్వదినమన్నారు.

అదేవిధంగా భోగి నుంచి ముక్కనుమ వరకు వాడవాడలా ఆనందోత్సాహంతో నిర్వహించుకునే ఈ వేడుక, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం ఈ సంక్రాంతి పర్వదినమన్నారు. భూమిని కన్నతల్లిగా ఆరాధించే తత్త్వం భారతీయులది. దీన్ని అనాధిగా పాటిస్తున్నామని, ఈ భావన సదా ఉన్నప్పుడు జాతి జాతిగా నిలుస్తుందన్నారు. ఈ భావ జాగృతికి ప్రతీకలు పండుగలు. వీటిలో అతి ముఖ్యమైనది మకర సంక్రాంతి.

ఈ పండుగ భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను తెలియజేస్తుందన్నారు. వ్యవసాయం, జీవనాధారమైన ఈ దేశంలో రైతులకు, గోజాతికి ఈ పండుగ ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాఠశాలలో పుడమి, రైతు, నవధాన్యాలు, నవ్యాంధ్రప్రదేశ్‌ తదితర రంగవళ్లులతో ఈ పండుగ విశిష్టతను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ సి.చంద్రమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సి.మంజులా రెడ్డి, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది యేసు, దొరబాబు, భాగ్యలక్ష్మీ, రెడ్డెమ్మ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.