
మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
ఢిల్లీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తిరిగి నియమితులయ్యారు.దీంతో షీలాదీక్షిత్ క్రియాశీల రాజకీయాల్లోకి పునఃప్రవేశించారు.కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ నేతృత్వంలో ఢిల్లీ కాంగ్రెస్ బలహీనపడటంతో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకూ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ మాకెన్ అనారోగ్యంతో తన పదవికి రాజీనామా చేశారు.గతంలో ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆమె పనిచేశారు. దేశరాజధాని అభివృద్ధిలో షీలా దీక్షిత్ తనదైన ముద్రవేశారు.
2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాంగా పార్టీ కార్యకలాపాకు దూరంగా ఉన్నారు. అయితే మాకెన్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ ఆమెకు పీసీసీ పగ్గాను అప్పగించింది.