టేకులపాళెంలో ఆకట్టుకున్న ముందస్తు సంక్రాంతి సంబరాలు

0
53
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
మదనపల్లి మండలం టేకులపాళెం మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు ప్రజలలను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులతోపాటు, గ్రామస్తులు పాల్గొని సందడి చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బి.వి.రమణ మాట్లాడుతూ భారతదేశంలో పర్వదినాలను ఎంతో భక్తిశ్రద్ధతో నిర్వహిస్తార న్నారు.

భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క బలమన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు పండుగలే నిదర్శనమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారన్నారు. కోడిపందేలు, గొబ్బెమ్మలు, మహి ళలు వేసే వివిధ రకాల ముగ్గులు ఎంతో అలరిస్తాయన్నారు.

ముఖ్యంగా రబీ సీజన్‌ పంటలను ఒడుపుకొని ఇళ్ల తీసుకొనే శుభసందర్భంగా రైతులు ఈ పర్వదినాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం మన సాంప్రదాయాులు కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైనా ఉన్నదన్నారు. అనంతరం విద్యార్థులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, గాలిపటాలు ఎగురవేయడం జరిగింది.

అదేవిధంగా విద్యార్థులు పగీతాలు ఆలపించి గ్రామస్తులను అలరించారు. ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలకు రావడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.ఈ సంక్రాంతి సంబరాల్లో ఉపాధ్యాయులు జి.నర సింహులు, ఒ.వి.రమణ, శ్రీనివాసులు, రాజేంద్ర ప్రసాద్‌, వెంకటేష్‌, గీతారాణి, విజయకుమారి మరియు విద్యార్థులు తది తరులు పాల్గొన్నారు.