గ్యాస్ లీకేజీతో పేలుళ్లు -రెండు ఇళ్లు ద్వంసం- రామసముద్రం మండలం కె.సి.పల్లిలో సంఘటన

0
1089
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఇంట్లో ఎవరు లేని సమయంలో గ్యాస్ సిలిండర్లు  లీకేజీ జరిగి విద్యుత్ లైటింగ్ తో పేలుళ్ళు సంభవించి రెండు ఇళ్లు ద్వంసం అయిన సంఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం కె.సి పల్లిలో శుక్రవారం జరిగింది.

అయితే ఈ ప్రమాదంలో ఏటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇళ్లు ద్వంసం కావడం వల్ల దాదాపు రూ.30లక్షల పైబడి ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా.చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం కె.సి.పల్లిలో శుక్రవారం ఉదయం ఈశ్వరరెడ్డి, రామచంద్రా రెడ్డిలకు(అన్నదమ్ములు ) చెందిన ఇళ్లలో ఉదయం కుటుంబ సభ్యులందరూ వ్యవసాయం పనుల నిమిత్తం పోలం వద్దకు వెళ్లారు.

వారు వెళ్లిన కొంత సేపటికే భారి శబ్ధం వచ్చింది. స్థానికులు వెంటనే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి చూడగ ఇళ్లు కూలి పోయింది. ఇది గమనించిన ఇంటి యజమానులు తీవ్ర ఆవేదనకు లోను అయ్యారు.

తమ ఇంట్లోని సిలిండెరుకు చెందిన రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకేజీ జరిగి విద్యుత్ లైట్ వెలగడంతో పేలుడు జరిగి ఈ ప్రమాదం సంభవించనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో సిలీండర్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఏదైన పేలుడు పదార్థాలు ఇళ్లలో నిల్వ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే అనుమానంతో స్థానిక పోలీసులు ఇళ్లంతా క్షుణ్ణంగా పరిశీలించగా ఏటువంటి ఆధారాలు లభించలేదు.

ప్రమాదం జరిగిన విధానాన్ని చూసి పలువురు ఆశ్చరపోతున్నారు. గ్యాసు లీకేజీ జరిగి దాని వల్ల పేలుడు సంభవించి ఉంటే ఇంట్లో వస్తువులు కాలిపోవాలి అయితే అలాంటివేవి జరగలేదు. కె.సి పల్లిలో జరిగిన పేలుళ్లకు కారణాలు కనుకోవాలంటే సంబంధిత సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగాల్సిందే. ఈ ప్రమాదం వల్ల ఈశ్వరరెడ్డి, రామచంద్రరెడ్డి కుటుంబం వీదిన పడినట్లు అయింది.దీంతో వారికి లక్షలాది రూపాయిల ఆస్తి నష్టం సంభవించింది.  ప్రభుత్వం తక్షణం స్పందించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

advertisment

ప్రమాదం జరిగిన గ్రామాన్ని మదనపల్లి ఎం.ఎల్.ఎ దేశాయ్ తిప్పారెడ్డి వెంటనె సందర్శించారు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన గ్రామస్థులు భయాందోళనకు లోను అయ్యారు.

ప్రమాదం విషయాన్ని కంపెనీకి నివేదించాం – ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ వెల్లడి

రామసముద్రం మండలం కె.సిపల్లిలో జరిగిన గ్యాస్ లీకేజీ పేలుళ్ల సంఘటన పై పుంగనూర్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు మనఛానల్.ఇన్ ప్రతినిధితో మాట్లాడారు. కె.సి.పల్లిలో  జరిగిన ప్రమాదానికి సంబంధించిన  సమాచారం అందగానే తమ బృందం గ్రామంలో పర్యటించి ప్రమాదంపై ఆరా తీసి వివరాలను తమ కంపెని అధికారులకు అందచేశామన్నారు. దీనిపై కంపెనీ ఉన్నతాధికారులు పరిశీలించి అద్యయనం చేసి సాంకేతిక నిపుణుల సహకారంతోవాస్తవాలు తెలుసుకొని బాధితులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని అన్నారు.