ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రోడ్డుప్రమాదం – రంగారెడ్డి జిల్లాలో ముగ్గురి మృతి

0
13
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – రంగారెడ్డి
ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. తరచూ జరుగుతున్న ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు పొగొట్టు కుంటున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్పై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్సును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయా లయ్యాయి.

కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా గంగావతికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు ఆస్పత్రికి వెళ్లి అంబులెన్సులో ఔటర్ రింగ్ రోడ్ గుండా తిరుగు పయనం అయ్యారు. వీరు కొంగర కలాన్ – రావిలాల సమీపంలో రాగానే డివైడర్ దాటుకుని వచ్చిన కారు వీరి అంబులెన్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్సులో ఉన్న గంగావతికి చెందిన బొల్లిరెడ్డి వెంకటేశ్వర రావు(60), అయన భార్య సుబ్బలక్ష్మి (55), ఏలూరుకు చెందిన డ్రైవర్ శివ (35) అక్కడికక్కడే మృతి చెందారు.

అందులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్ (40), హేమచందర్ (38), తొషిష్ (34), మరో వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మనోజ్ (34)కు గాయాలయ్యాయి. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.