‘‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’’ ఓ అద్భుత కావ్యం – ముఖ్యమంత్రి చంద్రబాబు

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’’ ఓ అద్భుత కావ్యమని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఇందులో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటించిన సంగతి తెలిసిందే.30ఏళ్ల చరిత్రను 3 గంటల సినిమాలో చూపారన్నారు. కథానాయకుడు చిత్రం చాలా బాగుందని తెలిపారు.

చిత్రంలో బాలకృష్ణ నటన బ్రహాండంగా ఉందని కొనియాడారు. ఇతర నటులు, సాంకేతిక వర్గం గొప్పగా చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.ఎన్టీఆర్ జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తి అని అన్నారు. సినిమాల కోసం మద్రాసు వెళ్లి అష్టకష్టాలెదుర్కొన్న ఎన్టీఆర్‌ తుఫాన్‌ కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించారని తెలిపారు. తుఫాన్‌లో ఇల్లు కూలకుండా నిట్టాడికి తన భుజాన్ని మోపారని గుర్తుచేశారు. విపత్తులో రైతులు, పేదల కష్టాలను చిన్ననాడే చూశారని తెలిపారు.

బాధితుల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించారని అన్నారు. బాధితులను ఆదుకోవడంలో ఎన్టీఆర్‌ ముందడుగు వేశారని సీఎం తెలిపారు. ప్రభుత్వాలకు, సినీనటులకు, సమాజ సేవకులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. బాల్యంలో లాంతర్ వెలుగులో చదువుకున్న ఎన్టీఆర్‌ సీఎం అయ్యాక ప్రతి గ్రామానికి విద్యుత్ అందించారన్నారు. నిరుపేదలకు పక్కా ఇళ్లు ఎన్టీఆర్ కట్టించారని చంద్రబాబు తెలిపారు.