ఉద్యోగానికి రాజీనామా చేసి సంచలన నిర్ణయం తీసుకున్న అలోక్‌వర్మ

0
57
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
తన ఉద్యోగానికి రాజీనామ చేస్తున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ ప్రకటించారు. దీంతో ఆయ న నిర్ణయం సంచలనంగా మారింది.సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో బుధవారం మరోసారి సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేప ట్టిన ఆలోక్‌ను మళ్లీ తప్పిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయ నను ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బదిలీ చేసింది.

ఈ నేపథ్యంలో ఆయన అగ్నిమాపక డీజీ బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశారు.సీబీఐలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ ఆస్థానాకు, ఆలోక్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, అధికారుల్లో కూడా రెండు వర్గాలుగా విడిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఇరువురి అధికారుల మధ్య నెలకొన్న పరిస్థితి సీబీఐ పరువు తీసేవిధంగా ఉందంటూ అక్టోబర్‌ 23న అర్ధరాత్రి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇద్దరు అధికారులనూ బలవంతంగా సెలవుపై పంపిస్తూ ఆదేశాలు జారీచేయడంతో పాటు సీబీఐలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. నాగేశ్వరారవును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా, అన్యాయంగా పదవి నుంచి తప్పించడంతో పాటు బలవంతంగా సెలవుపై పంపడాన్ని ఆలోక్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆయన పిటిషన్‌పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ పరిణామాలను పరిగణ నలోకి తీసుకోవడంతో పాటు సీవీసీని నివేదిక కోరింది.

ఈ పరిణామాలపై సీవీసీ సీల్డు కవర్‌లో నివేదికను అందజేసింది. ఉన్నతస్థాయి ప్యానల్‌ ఏర్పాటు చేసి నియమనిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన వ్యవస్థలో అర్ధరాత్రి పూట నిర్ణయాలు తగవంటూ సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యం లోనే ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిక్రీ రెండు రోజల పాటు చర్చించాక కేంద్రం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది.

ఉన్నతస్థాయి ప్యానల్‌ ఇచ్చిన సూచనల ఆధారంగా ఆలోక్‌ను తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన మన స్తాపానికి గురయ్యారు. తాను ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎవరో చేసిన ఆరోపణలకు తనను బలిచేశారనే ఉద్దేశంతో ఆయన అగ్నిమాపక డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు.