రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరెడ్డి అస్తమయం

0
281

మనఛానల్‌ న్యూస్‌ – రాయచోటి
కడపజిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యులు ఎం.నారాయణ రెడ్డి (68) గురువారం కన్ను మూశారు.అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడు తున్నారు.దీంతో ఆయన ఒక వారం కిందట చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

అక్కడ చికిత్స పొందుతున్న నారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 1994లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఆయన రెండు పర్యాయాలు శాసనసభకు ఎన్నికయ్యారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఆయనకు పేరుంది. నియోజకవర్గ అభివృద్ధిలో నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా తప్పక హాజరయ్యేవారని ప్రజలు తెలియజేశారు.

నియోజకవర్గ ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని పలువురు తెలియజేశారు.ఆయన మృతి పట్ల స్థానిక నేతలతో పాటు జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తంచేశారు. నారాయణ రెడ్డికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.