ఈనెల 21 నుండి కేసీఆర్‌ ఎర్రబల్లి వ్యవసాయ క్షేత్రంలో సహస్ర చండీయాగం

0
11
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సిద్ద్ధిపేట
జనవరి 21 నుండి 25 వరకు సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ముఖ్యమంత్రి స్వయంగా యాగం ఏర్పాట్లను పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీరనుమతితో ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. ఇటీవల విశాఖ వెళ్లిన సీఎం కేసీఆర్‌ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొంటారు. సందర్శకులు, భక్తులను అనుమతించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

యాగం ఏర్పాట్లను అష్టకాల రామ్మోహన్‌శర్మ, శృంగేరి పీఠం పండితులు ఫణిశశాంకశర్మ, గోపీకృష్ణశర్మ పర్యవేక్షిస్తున్నారు. 2015లో అయుత చండీయాగం, శాసనసభ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని సీఎం కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.