మదనపల్లిలో గళమెత్తిన కార్మిక సంఘాలు

0
11
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కార్మిక సంఘాలు రెండు రోజులపాటు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మదనపల్లిలో పలు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ మదనపల్లి పురపాలక సంఘం కార్యాలయం నుండి బెంగళూరు బస్టాండ్‌ మీదుగా హెడ్‌పోస్టాపీస్‌ వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల జీవితాలు మారలే దన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేశారని కార్మిక చట్టాలు ఉల్లంఘన చేస్తున్నవారిపై చర్యలు తీసుకోకుండా యాజమాన్యాలకు వత్తాసు పలకడం దారుణమన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీసవేతనం రూ.18000 ఇవ్వాలని, పర్మినెంట్ పనుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని, కార్మిక చట్టాలు కఠినంగా అమలు చేయాలని, కార్మిక చట్టాల్లో మార్పులు విరమించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ నిలుపుదల చేయాలని, అసంఘటిత రంగ కార్మికులు అందరికీ ప్రభుత్వ ఖర్చుతో సంక్షేమం సౌకర్యాలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి,

మోటార్ వాహన చట్ట సవరణ రద్దు చేయాలని, ధరల పెరుగుదల నియంత్రణ చేయాలని, సంఘం పెట్టుకునే హక్కు ఉండాలని, రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కంచకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాలను హెచ్చరించారు.

advertisment

ఈ ధర్నాలో సిఐటియు నాయకులు గొంగడి కృష్ణమూర్తి, నారాయణ, రాజశేఖర్, శ్రీనివాసులు, ఎఐటియుసి నాయకులు సాంబశివ, ఆంజనేయులు, వైఎస్సార్టియు నాయకులు ఎస్.షరీఫ్, ఐ.ఎఫ్.టి.యు నాయకులు రాజ్ కుమార్, హైదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.