ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా టాప్‌

0
14
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తమ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. జట్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో భారత్‌ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిస్తే 125 పాయింట్లతో ఇంగ్లాండ్‌కు చేరువలో నిలుస్తుంది..ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ ఖాతాలో 126 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి.

ఆసీస్‌పై 2-1తో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా ఆ జట్టుతో మూడు వన్డేలు, న్యూజిలాండ్‌లో ఐదు వన్డేలు ఆడ నుంది. వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలిస్తే 125 పాయింట్లు లభిస్తాయి. మరోవైపు నాలుగో స్థానంలోని దక్షిణాఫ్రికాను దాటేయా లంటే మాత్రం పాక్‌ 5-0తో సిరీస్‌ గెలవాల్సిందే. బ్యాటింగ్‌ జాబితాలో కోహ్లీ, రోహిత్‌ శర్మ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా అగ్రస్థానంలో ఉండగా కుల్‌దీప్‌ యాదవ్‌ మూడో ర్యాంకులో నిలిచాడు. శ్రీలంకపై 3-0తో అద్భుత విజయం సాధించిన న్యూజిలాండ్‌ ఆటగాళ్ల ర్యాంకులు మారాయి. పరుగుల వరద పారిస్తున్న రాస్‌ టేలర్‌ మూడు, మార్టిన్‌ గప్తిల్‌ 14 స్థానాల్లో ఉన్నారు. కేన్‌ విలియమ్సన్‌ 11వ ర్యాంకుకు చేరుకున్నాడు.