శతక్కొట్టిన టేలర్‌, నికోలస్‌ – శ్రీలంకతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన కివీస్‌

0
16
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
న్యూజిలాండ్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ (137 పరుగులు 9 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోస్‌ (124 పరుగులు 80 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) నాటౌట్‌ చెలరేగి శతకాలు సాధించడంతో శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్‌ 115 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.దీంతో మూడు వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ టేలర్‌, నికోలస్‌ శతకాలతోపాటు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (55 పరుగులు 6 ఫోర్లు, 1 సిక్సర్‌)తో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్‌ 364/4 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మలింగ 3, సందకన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు. అనంతరం 365 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్లు డిక్‌వెల్లా, ధనుంజయ డిసిల్వాలు తొలివికెట్‌కు 66 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.

డిక్‌వెల్లా (46) పరుగులు, డిసిల్వా (36), కౌసల్‌ పెరీరా (43) పరుగులు చేసినప్పటికీ మిడిలార్డర్‌ విఫలమవడంతో ఓదశలో 143 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది శ్రీలంక. ఇక గత మ్యాచ్‌ హీరో తిసారా పెరీరా మరోసారి అపద్భాంధవుడి పాత్ర పోషించాడు.

తిసారా పెరీరా (80 పరుగులు 63 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) 6వ వికెట్‌కు గుణతిలక (31)తో కలసి 101 పరుగులు జోడించాడు.244 పరుగుల వద్ద పెరీరా 6వ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక చివరి 4 వికెట్లు కేవలం 5 పరుగుల తేడాతో కోల్పో యింది. దీంతో 41.4 ఓవర్లలో 249 పరుగులకు శ్రీలంక అలౌటయింది.ఇక ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం ఏకైక టీ20 మ్యాచ్‌ జరుగనుంది.