పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసిన సాయిపల్లవి

0
29
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు సాయిపల్లవి. ప్రస్తుతం సాయిపల్లవి పేరు అన్ని భాషల్లో మార్మో గిపోతోంది.ఈ అమ్మ‌డు రీసెంట్‌గా ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. శ‌ర్వానంద్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారు.

ఈ చిత్రంతో శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి న‌ట‌నకి మంచి మార్కులు ప‌డ్డాయి. కాని క‌థ జ‌నాల‌కి కాస్త బోర్ కొట్టించ‌డంతో మూవీకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది.ఈ నేప‌థ్యంలో నిర్మాత‌ల‌కి కాస్త న‌ష్టం కూడా చేకూరిందని స‌మాచారం. అయితే ఈ విష‌యం సాయిప‌ల్ల‌వి కి కూడా చేర‌డంతో త‌న రెమ్యున‌రేష‌న్‌ని తిరిగి నిర్మాత‌ల‌కే ఇచ్చేసిందని అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోలు మాత్ర‌మే త‌మ రెమ్యున‌రేష‌న్‌ని ఇలా తిరిగి ఇచ్చేసిన సంద‌ర్భాలు చూశాం. కాని నిర్మాత బాగోగులు ఆలోచించిన హీరోయిన్ త‌న పారితోషికాన్ని రిట‌ర్న్‌గా ఇవ్వ‌డ‌మ‌నేది గొప్ప విష‌యం అని అంటున్నారు.

సాయి ప‌ల్ల‌వి చేసిన ప‌నికి ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. సాయి ప‌ల్ల‌వి న‌టించిన మారి 2 కూడా ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌ తి తెలిసిందే . ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఎన్ జి కె చిత్రంలో నటిస్తుంది సాయిప‌ల్ల‌వి.