339వ రోజు ప్రారంభమైన వై.ఎస్‌.జగన్‌ ప్రజాసంకల్పయాత్ర

0
237

మనఛానల్‌ న్యూస్‌ – శ్రీకాకుళం
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 339వ రోజుకు చేరుకుంది.13జిల్లాల్లో దిగ్విజయంగా సాగిన ఈ ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరుకోవడంతో ఇచ్ఛాపురం వద్ద పాదయాత్ర ముగిసే ప్రాంతంలో అతిపెద్ద ఫైలాన్‌ ఏర్పాటు చేశారు.

ఈ ఫైలాన్‌లో 13 జిల్లాలకు గుర్తుగా 13 మెట్లను ఏర్పాటు చేశారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే వెల్లిడించారు.339వ రోజైన సోమవారం ఉదయ వై.ఎస్‌.జగన్‌ తన పాద యాత్రను ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని తలతంపర నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బల్లిపుట్టుగ, కుసుంపురం, బొరి వంక మీదుగా బెజ్జిపుట్టుగ, జగతి వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.