నగదు కొరత సమస్యలపై ప్రత్యేక చర్యలు – ఆర్‌.బి.ఐ.గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌

0
5

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
దేశవ్యాప్తంగా నగదు కొరత సమస్య ఏర్పడినప్పుడు దానిపై భారత రిజర్వు బ్యాంకు ప్రత్యేక చర్యల తీసుకుంటుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు.ప్రస్తుతానికి నగదు నిల్వల సమస్య చాలా వరకు తీరిందని వెల్లడించారు.

ఈరోజు శక్తికాంత్‌ దిల్లీలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ నగదు కొరత సమస్య తగ్గిందని, తరచూ ఈ అంశంపై సమీక్ష చేస్తున్నామని చెప్పారు. రేపు శక్తికాంత్‌ బ్యాంకింగేతర ఫైనాన్షియల్‌ కంపెనీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పునర్నిర్మాణం కోసం వచ్చే రుణాల దరఖాస్తుల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని శక్తికాంత్‌ బ్యాంకులకు సూచించారు. ఆర్థిక వ్యవస్థలోకి నగదును పంపించడం అవసరాలను బట్టి ఉంటుందని, ఆర్బీఐ తగినంత నగదు నిల్వలను ఉంచుతుందని ఆయన‌ పేర్కొన్నారు.