రైతన్నల రాజ్యం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం – పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి

0
258

మనఛానల్‌ న్యూస్‌ – కురబలకోట
రైతన్నల రాజ్యం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని తంబళ్లపల్లి నియోజవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు.శనివారం కురబలకోట మండలంలో ‘‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’’ కార్యక్రమం ప్రారంభమైంది.ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వై.ఎస్‌.జగన్‌ రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. ప్రజ సమస్యలను తెలుసుకోవడానికి కష్టాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా 3600 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేయడం ఆయనకే సాధ్యమని కొనియాడారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో కరువుఛాయలు అలముకున్నాయని, కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో టిడిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రజాసమస్యలను పక్కనే ప్రచార్భారాటలకే టిడిపి నాయకులు పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో టిడిపి నాయకులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ‘‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’’ కార్యక్రమం ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకోవడం జరిగిందని, ప్రజల సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధా న్యతను ఇస్తామన్నారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలు చేసి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల దాకా ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నను ముఖ్య మంత్రిని చేద్దామని తద్వారా రాజన్న రాజ్యాన్ని సాకారం చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో కురబలకోట మండల వైఎస్సా ర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.