బుచ్చిరెడ్డిగారిపల్లి పాఠశాలలో ఆకట్టుకున్నజన్మభూమి రంగోళీ పోటీలు

0
80
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
‘‘జన్మభూమి – మా ఊరు’’ కార్యక్రమంలో భాగంగా బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లిలోని మండల పరిషత్‌ ప్రాథమి కోన్నత పాఠశాలలో శనివారం రోజు రంగోళీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థినీలు హాజరై ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగింది.

గండువారిపల్లి, కొండకిందపల్లి, అచ్చెమ్మకోట మరియు బుచ్చిరెడ్డిగారిపల్లి పాఠశాలల్లో చదువుతున్న సుమారు 40 మంది బాలికలు పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయుడు పి.ఢిల్లీ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రస్తుతం అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. పలు రకా రంగవల్లులు ప్రజలను అలరించాయన్నారు.

రంగవల్లుల పోటీల్లో విద్యార్థినీలు రాణించి మండల, జిల్లా స్థాయిల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ, ఉపాధ్యాయినీలు నాగమణి, విజయలక్ష్మీ, లక్ష్మీ,సరస్వతమ్మ, నీలిమ,రెడ్డిరాధిక, రెడ్డెప్పరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సిఆర్‌పి వెంకటరమణ, వీఆర్‌ఏలు వెంకటరమణ, మాబు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.