వెండి ధరకు రెక్కలు – రూ.40 వేల మార్క్‌ను దాటేసిన వైనం

0
13
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
వెండి ధరు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.వరుసగా నాలుగో రోజు ధర పెరగడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి రూ. 40వేల మార్క్‌ దాటింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 440 పెరిగి కేజీ వెండి ధర రూ. 40,140 పలికింది.

పారిశ్రామివ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటు న్నాయి.అటు బంగారం ధర మాత్రం కాస్త దిగొచ్చింది. డాలర్‌తో రూపాయి బలపడటంతో పాటు స్థానికంగా కొనుగోళ్లు తగ్గడంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 145 తగ్గి రూ. 32,690గా ఉంది.

గడిచిన మూడు రోజుల్లో బంగారం ధర రూ. 565 పెరిగింది. కాగా అంతర్జాతీయంగా ఈ లోహల ధరలు స్వల్పంగా పెరిగాయి. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1293.61 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.75 డాలర్లుగా ఉంది.