రూ.200 కోట్ల వసూళ్ల దిశగా రణ్‌వీర్‌సింగ్‌ ‘‘సింబా’’

0
27
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘‘టెంపర్‌’’ సినిమా టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సంగతి విదితమే.ఇక అప్పటి నుంచి ఈ చిత్రాన్ని పలు భాషల్లో తెరకెక్కించాలని బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రయత్నించాయి.

కోలీవుడ్‌లో విశాల్‌ ‘అయోగ్య’ గా తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్‌లో రణవీర్‌సింగ్‌ ‘సింబా’ గా రీమేక్‌ చేశారు. ఈ చిత్రం గతవారం విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఎన్టీఆర్‌ నటనకు, రణవీర్‌ నటకు పోలిక లేకున్నా సినిమా మాత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వందకోట్లు, ఏడు రోజుల్లోనే 150కోట్లను కొల్లగొట్టింది.

ఇక ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే ఇదే జోరును కొనసాగిస్తే.. ‘సింబా’ 200కోట్లను దాటేసి 250కోట్లను వసూళ్లు చేసే అవకాశంఉందని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అలీఖాన్‌ హీరోయిన్‌గా నటించారు.