దుబాయ్‌లో ఫిబ్రవరి 1న శ్రీనివాస కళ్యాణోత్సవం

0
29
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో భాగం గా గల్ఫ్‌ దేశమైన దుబాయ్‌లో ఫిబ్రవరి 1న శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. అజ్మన్‌ సిటీ సెంటర్‌ పక్కన గల అల్‌జర్ఫ్‌ హబిటాట్‌ స్కూల్‌లో ఈ వేడుక జరగనుంది.

ఆ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుప్రబాతసేవ, 8 నుంచి 9 గంటల వరకు తోమాలసేవ, 9 నుంచి 10 గంటల వరకు 108 కలశాలతో అభిషేకం జరుగుతుంది. 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుకల్యాణం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు సర్వదర్శనం, 4 నుంచి 5 గంటల వరకు విష్ణుసహస్రనామం, 5నుంచి గరుడ సేవ ఉంటుం ది. యూఏఈలో మొదటిసారిగా స్వామివారి గరుడసేవ నిర్వహిస్తున్నారు. వైభవోపేతంగా జరిగే స్వామివారి కల్యాణ వేడుకలో పాల్గొనే వారు +971555794466, +971585771709 అనే నెంబర్లను సంప్రదించవచ్చు.