బాలీవుడ్‌ నటుడు అనుపమఖేర్‌పై కేసు నమోదు

0
58

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమఖేర్‌పై కేసు నమోదు చేశారు.ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం వివాదాస్పదం కావడంతో అనుపమ్‌తో పాటు చిత్రబృందంపై బిహార్‌ న్యాయస్థానంలో సుధీర్‌ కుమార్‌ ఓజా అనే న్యాయవాది పిటిషన్‌ వేశారు.

ఈ సినిమా ద్వారా పేరున్న నేతలను తప్పుగా చూపించేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయస్థానం పిటిషన్‌ ను స్వీకరించింది. 8న విచారణ జరపనుంది.సినిమాలో మన్మోహన్‌ సింగ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, ఆయన సలహాదారుగా వ్యవ హరించిన సంజయ్‌ బారు పాత్రలో అక్షయ్‌ ఖన్నా నటించి వారి పరువు తీశారు.

ఇది నన్నే కాదు ఎంతో మందిని బాధించింది. అంతేకాదు సినిమాలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా పాత్రల్లో నటించినవారు కూడా వారి ఇమేజ్‌ను దెబ్బతీశారు. చిత్ర దర్శకుడు, నిర్మాతపై కూడా ఫిర్యాదు చేశానని ఓజా వెల్లడించారు.