అధిక కొవ్వును తగ్గించే ఐదు అద్భుతమైన చిట్కాలు

0
16
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌డెస్క్‌
ప్రస్తుతం జంక్‌ ఫుడ్స్‌ను అధికంగా తీసుకోవడం వలన కొందరిలో కొవ్వుశాతం పెరిగిపోతోంది.అధిక బ‌రువును త‌గ్గించుకోవాలంటే రుచిగా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను మానేయాల‌ని చెబుతుంటారు. అయితే అన్ని ఆహార ప‌దార్థాలు అలాంటి కోవ‌కు చెంద‌వు.

కొన్ని రుచిగా ఉండే ఆహారాల‌ను మానేయాల్సిన ప‌నిలేదు. నిజానికి వాటిని తీసుకుంటేనే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గుతారు. మరి అధిక బ‌రువును త‌గ్గించుకోవాలంటే మ‌న ఆహారంలో భాగం చేసుకోవాల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

క‌రివేపాకు..: నిత్యం ఉద‌యాన్నే కొన్ని క‌రివేపాకుల‌ను అలాగే న‌మిలి మింగాలి. క‌రివేపాకులో కొవ్వును క‌రిగించే ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు.

గరం మసాలా పొడి..: లవంగాలు, జీలకర్ర తదితరాలు కలిపి తయారు చేసిన గరం మసాలా పొడిని నిత్యం ఒక టీస్పూన్‌ మోతాదులో ఆహారంతోపాటు తీసుకున్నా సులభంగా బరువు తగ్గవచ్చని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అయితే అంతకు మించితే మాత్రం ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. క‌నుక ఈ పొడిని మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.

ఎర్ర మిరపకాయల కారం ..: కారం కారం అని కొంద‌రు కారం తినేందుకు త‌ట‌ప‌టాయిస్తారు కానీ నిజానికి కారం వ‌ల్ల కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఎందుకంటే.. ఎర్ర మిర‌ప‌కాయ‌ల్లో క్యాప్సెసిన్ అన‌బ‌డే ప‌దార్థం ఉంటుంది. ఇది శ‌రీర మెట‌బాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ఫలితంగా క్యాల‌రీలు త్వ‌రగా ఖ‌ర్చ‌వుతాయి. అధిక బ‌రువు తగ్గుతారు.

advertisment

పసుపు..: పసుపులో కర్క్యుమిన్‌ అనే ఓ రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోకుండా చూస్తుంది. కాబట్టి నిత్యం మన ఆహారంలో పసుపును భాగం చేసుకుంటే బరువు తగ్గవచ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక టీస్పూన్ ప‌సుపును క‌లుపుకుని తాగితే ఫ‌లితం ఉంటుంది.

జీలకర్ర..: జీర్ణ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించడంలో జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరిగి కొవ్వు కూడా కరుగుతుంది.