సంక్షేమ పాలన జగనన్నతోనే సాధ్యం – మదనపల్లి ఎమ్మెల్యే డా.తిప్పారెడ్డి

0
213

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
ప్రజాసంక్షేమ పాలన వై.ఎస్‌.జగన్‌తోనే సాధ్యమని మదనపల్లి శాసనసభ్యులు డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం మదనపల్లి సమీపంలోని శానిటోరియం వద్ద గల తురకపల్లిలో నిర్వహించిన ‘‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’’ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు.

ముందుగా నాయకులతో కలసి ఇంటింటికీ వెళ్లి నవరత్నాలకు గురించి ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామప్రజల సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వై.ఎస్‌.జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు అన్నివర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.

ఇప్పటికే 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసి రాష్ట్రచరిత్రలో వై.ఎస్‌.జగన్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారన్నారు. గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముస్లింకు 4% రిజర్వేషన్‌లు ప్రకటించి వారి అభ్యున్నతికి పాటు పడ్డారన్నారు.వైఎస్సార్‌సీపీలో ముస్లింలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో రాగానే నవరత్నా లను అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు.

రాబోవు ఎన్నికల్లో అందరూ వైఎస్సార్‌సీపీకి మద్ధతుగా నిలవాలని, తద్వారా వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రి చేసి రాజన్న రాజ్యా న్ని సాకారం చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కో- ఆర్డినేటర్‌ టి.కిశోర్‌ కుమార్‌ రెడ్డి, నాయకులు నారాయణ రెడ్డి, నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.