ఫ్యాటీ లివర్‌ను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
23
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
మానవశరీరంలో అతిముఖ్యమైన అవయవం కాలేయం. మ‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేసి శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డంలో, శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో లివ‌ర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ క్ర‌మంలోనే అప్పుడ‌ప్పుడు లివ‌ర్‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒక‌టి. లివ‌ర్‌లో కొవ్వు శాతం ప‌రిమితికి మించి ఉంటే అప్పుడు ఆ స్థితిని ఫ్యాటీ లివ‌ర్ అంటారు.

ఈ వ్యాధి వ‌చ్చిన వారిలో లివర్ క‌ణాలలో కొవ్వుతో ట్రైగ్లిజరైడ్‌ కణాలు వచ్చిచేరతాయి. దీంతో కొవ్వు కాలేయ కణాలలో నిల్వ అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఈ కొవ్వును కాలేయ కణాలు సరళ పదార్థాలుగా మార్చలేకపోతాయి. దీంతో ఫ్యాటీలివర్‌ ఏర్పడు తుంది. అయితే ఫ్యాటీ లివర్‌ వ్యాధి ప్రమాదకరమైనది కాదు కానీ కాలేయం బరువు కన్నా 10 శాతం కొవ్వు పెరిగితే అనేక దుష్ఫలితాలు ప్రారంభ‌మ‌వుతాయి.

కొవ్వుశాతం అధికంగా ఉండటం వల్ల కాలేయంలో వాపు కనిపిస్తుంది. కాలేయం పనితీరు మందగిస్తుంది. ఫ్యాటీ లివ‌ర్ రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌. ఈ వ్యాధి ఆల్కహాల్‌ అధికంగా తీసుకునే వారిలో కనిపిస్తుంది. రెండోది నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌.

ఆల్కహాల్‌ అలవాటు లేకపోయినా బరువు అధికంగా ఉండటం, చక్కెర వ్యాధితో బాధపడుతుండటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే అధిక బరువు లేకుండా సన్నగా ఉండే వారిలో కూడా ఈ వ్యాధి వస్తుంది. ఇది వంశపారంపర్యంగాను, వివిధ రకాల వ్యాధులకు మందులు వాడటం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఫ్యాటీ లివ‌ర్ లక్షణాలు..: ఫ్యాటీ లివ‌ర్ వ‌స్తే అంత త్వ‌ర‌గా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌వు. వ్యాధి ముదిరితేనే ల‌క్ష‌ణాలు తెలుస్తాయి. లివ‌ర్‌లో వాపు, హెప‌టైటిస్‌, సిర్రోసిస్ వంటి వ్యాధులు వ‌స్తాయి. కొన్నిసార్లు కామెర్లు అవుతాయి. అలాగే పొట్ట‌లో కుడి వైపు నొప్పి వ‌స్తుంది. దీంతోపాటు ఆ ప్ర‌దేశంలో వాపు క‌నిపిస్తుంది. అలాగే జ్వరం, వాంతులు వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం, క‌డుపు నొప్పి త‌దిత‌ర ల‌క్షణాలు మ‌న‌కు ఫ్యాటీ లివ‌ర్ వ్యాధిలో క‌నిపిస్తాయి.

advertisment

ఇలా త‌గ్గించుకోవ‌చ్చు..: ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి త‌గ్గాలంటే ఆహార ప‌దార్థాల‌ను తినే విష‌యంలో నియంత్ర‌ణ పాటించాల్సి ఉంటుంది. అలాగే ప‌లు ప‌దార్థాల‌ను కొన్ని రోజుల పాటు పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా మ‌సాలా ప‌దార్థాలు, చ‌ల్ల‌ని వ‌స్తువులు, వేపుళ్లు తిన‌రాదు. కూర‌గాయ‌లు ఎక్కువ‌గా తినాలి. అధిక బ‌రువు ఉంటే త‌గ్గే ప్ర‌య‌త్నం చేయాలి. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మందులను వాడాలి. దీంతోపాటు ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కూడా ఫ్యాటీ లివ‌ర్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

– ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి 30 నిమిషాల ముందు తాగాలి. దీని వ‌ల్ల లివ‌ర్ లో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. ఫ్యాటీ లివ‌ర్ త‌గ్గుతుంది.
– ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌కు గ్రీన్ టీ అద్బుతంగా ప‌నిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్‌ను ప‌రిర‌క్షిస్తాయి. రోజుకు క‌నీసం 3 క‌ప్పుల వ‌ర‌కు గ్రీన్ టీని తాగితే ఫ‌లితం ఉంటుంది.
– ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలు లేదా నీటిలో ఒక టీస్పూన్ ప‌సుపు క‌లుపుకుని నిత్యం రాత్రి నిద్రించే ముందు తాగాలి. లివ‌ర్ ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించే గుణాలు ప‌సుపులో ఉన్నాయి.
– బొప్పాయి పండును నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఫ్యాటీ లివర్ స‌మ‌స్య నుంచి త్వ‌రగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
– నిత్యం ఉద‌యాన్నే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ ర‌సాన్ని తాగుతున్నా లివ‌ర్ వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.