రోడ్డును దాటేటప్పుడు జాగ్రత్త వహించండి – టిడిపి కువైట్‌ వెల్ఫేర్‌ కో-ఆర్డినేటర్‌ గుదె నాగార్జున చౌదరి

0
94
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ న్యూస్‌
కువైట్‌లో నివాసముండే తెలుగువారు రోడ్డు దాటే సమయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని టిడిపి కువైట్‌ వెల్ఫేర్‌ కో-ఆర్డినేటర్‌ గుదె నాగార్జున చౌదరి అన్నారు. ఇటీవల కడపజిల్లా రాయచోటి మండలానికి చెందిన అరుణకుమారి అనే మహిళను కువైట్‌లోని కైరావాన్‌ ప్రాంతంలో రోడ్డుదాటే సమయంలో కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో అరుణ కుమారి మృతిచెందింది.

ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తెలుగుదేశం కువైట్‌ విభాగం వారిని సంప్రదించగా వెంటనే స్పందించిన టిడిపి కువైట్‌ వెల్ఫేర్‌ కో-ఆర్డినేటర్‌ గుదె నాగార్జున చౌదరి, మృతురాలి బంధువులు మరియు ఎంబసీ వారి సహకారంతో ఈ సంఘటనకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ను పూర్తి చేయించి, ఇండియాలో విమానాశ్రయం నుండి వారి స్వస్థలానికి మృతదేహాన్ని చేర్చుటకు ఏపిఎన్‌ఆర్‌టి సుధాకర్‌రావు సహకారంతో ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారన్నారు.

అదేవిధంగా కువైట్‌కు చెందిన బలిజ సేవా సంఘం వారు మృతదేహాన్ని ఉంచే ప్రీజర్‌ బాక్సుకు అయ్యే ఖర్చు రూ.14 వేలను కువైట్‌ బలిజ సేవా సంఘం అధ్యక్షుడు, కమిటీ సభ్యులు వారి బంధువులకు అందజేశారు.కువైట్‌లో నివసించే తెలుగువారు ఎటువంటి అవసరమొచ్చినా టిడిపి కువైట్‌వారిని, 0096595599492 అనే మొబైల్‌ నెంబర్‌ను సంప్రదించాలని తెలుగుదేశం కువైట్‌ కార్యవర్గం తెలియజేసింది.