మదనపల్లి పట్టణంలో అభాగ్యుల ఆకలిని తీర్చిన హెల్ఫింగ్‌మైండ్స్‌ సంస్థ

0
165

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
మదనపల్లి డివిజన్‌ పరిధిలో ఇప్పటికే పలు సేవాకార్యక్రమాలు చేపట్టి అందరి ప్రశంసలను అందుకొంది హెల్ఫింగ్‌ మైండ్స్‌. ఇందులో భాగంగా శనివారం ప్రధాన కూడళ్లలో ఉన్న అనాధలు, అభ్యాగుల ఆకలిని తీర్చారు ఆ సంస్థ సభ్యులు.

శుక్రవారం పట్టణంలో రెండు కార్యక్రమాలలో భోజనం మిగిలిందని సమాచారం అందుకున్న హెల్ఫింగ్‌ మైండ్స్‌ సభ్యులు ఫయాజ్‌,కిరణ్‌, మొహిద్‌,దినేష్‌లు మిగిలిపోయిన భోజనాన్ని సేకరించి ప్యాకెట్లకు తయారు చేసి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్‌, చిత్తూరు బస్టాండ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, ఎన్టీఆర్‌ కూడళ్లలో మరియు ఆర్టీసీ బస్టాండ్‌లోని అనాథలు, అభాగ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా హెల్ఫింగ్‌ మైండ్స్‌ వ్యవస్థాపకలు అబూబకర్‌ సిద్ధిక్‌ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనేనినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ఆకలి చావులను తగ్గించడానికి తమసంస్థ కృషి చేస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరూ సమాజసేవలో భాగస్వాములు కావాలన్నారు. ఎవరైనా సమాజసేవా కార్యక్రమాలు చేపడితే వారికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.

ఎవరైనా శుభకార్యాలు, ఫంక్షన్లు నిర్వహించిన అనంతరం ఆహారం మిగిలితే దానిని దుబారా చేయకుండా మా సంస్థకు సమాచా రం అందివ్వాలని ఆయన కోరారు.అన్నం పరబ్రహ్మ స్వరూమని, దానిని వృధా చేయడం మంచిది కాదన్నారు.అందరి సహకారం తో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు ఆయన వివరించారు.