తెలంగాణ తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎస్‌ రాధాకృష్ణన్‌

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎస్‌ రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్న విషయం విదితమే. ఆయనతోపాటు ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లను తెలంగాణ హైకోర్టుకు కేటాయిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన మీదట రాష్ట్రపతి ఈ ముగ్గురినీ తెలంగాణ హైకోర్టులో కొనసాగేలా నిర్ణయించినట్లు అందులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తూ 26వ తేదీ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు జనవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా రూపాంతరం చెందుతుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ప్రస్తుతం హైదరాబాద్‌ హైకోర్టులో సేవలంది స్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ వి.రామసుబ్ర మణియన్‌లను హైదరాబాద్‌ నుంచి పనిచేసే తెలంగాణ హైకోర్టులోనే కొనసాగించాలని నిర్ణయించారని న్యాయశాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 24 మంది న్యాయమూర్తులను కేటాయించిన తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య 13కి చేరింది.